ఉపాధి హామీ పనులను పరిశీలించిన హన్మకొండ జిల్లా కలెక్టర్
హనుమకొండ, 29 మే (హి.స.) హనుమకొండ జిల్లా కమలాపూర్ అడిగి మండలంలోని ఉప్పల్ గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి హామీ (ఈజీఎస్) పనులను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి శుక్రవారం పరిశీలించారు. ఉపాధి హామీ పనులకు ప్రతిరోజు ఎంతమంది కూలీలు వస్తున్నారని అధికారులను ఆమె
Collector


హనుమకొండ, 29 మే (హి.స.)

హనుమకొండ జిల్లా కమలాపూర్

అడిగి మండలంలోని ఉప్పల్ గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి హామీ (ఈజీఎస్) పనులను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి శుక్రవారం పరిశీలించారు. ఉపాధి హామీ పనులకు ప్రతిరోజు ఎంతమంది కూలీలు వస్తున్నారని అధికారులను ఆమె తెలుసుకున్నారు. ఉపాధి హామీ పని ప్రదేశం వద్ద పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలతో క్షేత్రస్థాయిలో వారికి కల్పిస్తున్న సౌకర్యాలను గురించి కలెక్టర్ ఆరా తీశారు. ఉపాధి హామీ పనులకు క్రమం తప్పకుండా వస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. మహిళ కూలీలను స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్నారా ఒకవేళ ఉండి రుణాలు తీసుకుంటే సకాలంలో కడుతున్నారా అని కలెక్టర్ ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు.

ఈజీఎస్ పనులు చేస్తుండగా ఫోటోలు దిగే సమయంలో ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫార్మ్ పాండ్ ను కలెక్టర్ పరిశీలించారు. ఉపాధి హామీ పనులకు 480 మంది కూలీలు హాజరవ్వడంపై, ఉపాధి హామీ కూలీలకు సౌకర్యవంతంగా ఏర్పాటు చేసిన తాగునీరు, టెంట్లు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు, తదితర వసతులు కల్పించడం పట్ల జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులు వేగంగా జరుగుతుండడంపై డీఆర్డీఓ మేన శ్రీను, కమలాపూర్ ఎంపీడీవో గుండె బాబు, ఈజీఎస్ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రమా, తహసీల్దార్ సురేష్ కుమార్, ఈజీఎస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande