హైడ్రా 'ఈగల్ టీమ్'లో ట్రాన్స్ జెండర్లు.. చెరువుల సంరక్షణ లో కీలక పాత్ర
హైడ్రా 'ఈగల్ టీమ్'లో ట్రాన్స్ జెండర్లు.. చెరువుల సంరక్షణ లో కీలక పాత్ర
Hydra


హైదరాబాద్, 29 మే (హి.స.)

హైడ్రాలో ఉద్యోగం ట్రాన్స్టెండర్ల జీవితాల్లో కొత్త వెలుగులు తెచ్చింది. కొలువు తెచ్చిన గౌరవం.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇక వారు వెనక్కి చూడడంలేదు. విధులు ఎక్కడైనా.. ఎప్పుడైనా సిద్ధమంటున్నారు. చెరువులు, తొలగించడంలో నాలాల కబ్జాలను భాగస్వామ్యమౌతున్నారు. పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన కాపాడడంలో స్థలాలను ముందుంటున్నారు. మొత్తం 16 మంది ట్రాన్స్టెండర్లకు హైడ్రా అవకాశం కల్పించింది. ఇందులో ట్రాన్స్ ఉమెన్ 11 మంది ఉంటే.. ట్రాన్స్మెన్ ఐదుగురున్నారు. ఆక్రమణదారులు ఎంతటి వారైనా వెరవకుండా.. విధులు నిర్వహించి ప్రజా ఆస్తులు కాపాడడంలో భాగస్వామ్యమౌతున్నారు. హైడ్రా (HYDRAA)లో మాకు దక్కిన ఉద్యోగం కేవలం ఉపాధి మాత్రమే కాదు.. మా జీవితాలకు కొత్త గుర్తింపు అని అంటున్నారు. హైడ్రా యూనీఫామ్ వేసుకోవడం గౌరవంగా భావిస్తున్నామని అంటున్నారు. హైడ్రా ఈగల్ టీమ్ గా నామకరణం చేసి.. విధుల్లో భాగస్వామ్యులను చేయడం ఎంతో సంతోషంగా ఉందని ట్రాన్స్టెండర్లు చెబుతున్నారు.

కబ్జాదారులు ఎంతటి వారైనా.. హైడ్రా వెనుకడుగు వేయదు. హైడ్రా ఇచ్చిన ధైర్యంతో ఈగల్ టీమ్ పని చేస్తోంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం, ఐలాపూర్లో 862 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడడంలో ట్రాన్స్టెండర్లు చురుకైన పాత్ర పోషించారు. ఇటీవల మాదాపూర్ లో ఈదులకుంట కాపాడడంలో చురుకైన పాత్రపోషించారు. ప్రజలకు నచ్చజెప్పడం, మహిళలతో మాట్లాడి పరిస్థితిని సర్దిచెప్పడం, అధికారులు-ప్రజల మధ్య సమన్వయం చేయడం

వంటి పనుల్లో వారు ప్రత్యేక పాత్ర పోషించారు. వారిలో సహనం ఎక్కువ. భావోద్వేగాలను అర్థం చేసుకునే గుణం ఉంది. అందుకే ఫీల్డ్లో మంచి ఫలితాలు సాధిస్తున్నారు అని హైడ్రా అధికారులు ప్రశంసిస్తున్నారు. హైడ్రాలో పనిచేస్తున్న చాలామంది ట్రాన్స్టెండర్లు ఇప్పుడు తమ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande