
హైదరాబాద్, 29 మే (హి.స.)
ధాన్యం కొనుగోలు విషయంలో
ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 29 రాష్ట్రాల్లో తెలంగాణలో కొనుగోలు చేస్తున్నట్లు మరెక్కడా చేయడం లేదని దీనిని భారత ప్రభుత్వమే అంగీకరించిందన్నారు. ధాన్యం కనుగోళ్లలో తెలంగాణ నంబర్ 1 అని కేంద్రం చెబుతోందని వెల్లడించారు. ఇవాళ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. మద్దతు ధర కోసం రూ. 16 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు చెప్పారు. మేం వచ్చాక రాష్ట్రంలో ఇప్పటి వరకు ఐదు పంటలు పండితే ఐదు పంటల్లో రికార్డు స్థాయిలో కొనుగోళ్లు జరిపామన్నారు. చివరి గింజ వరకు మద్దతు ధరతో కొనుగోలు చేస్తామన్నారు.
ఇప్పటి వరకు 11 వేల 50 కోట్లను రైతులకు చెల్లించామన్నారు. అకాల వర్షాలతో 60 లక్షల మెట్రిక్ టన్నుల్లో 9 వేలకు పైగా టన్నుల తడిసిన ధాన్యం ఉందన్నారు. తడిసిన ధాన్యం కూడా మద్దతు ధరతో కొంటునన్నామని తెలిపారు. కొనుగోళ్లు వేగవంతం చేసేందుకు ఇసుక, సిమెంట్ ఫ్యాక్టరీల లారీలు ధాన్యం కోసం ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో హమాలీల కొరత ఉందని కూలీలు సొంతూళ్లకు వెళ్లి రావడంతో కాస్త ఆలస్యమైందన్నారు. యాసంగిలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశామన్నారు. బీఆర్ఎస్ వాళ్లు గతంలో 7 వేల కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేస్తే మేం 8 వేల 575 కొనుగోలు కేంద్రాలు పెట్టామని ఇప్పటి వరకు 11 వేల 50 కోట్లను రైతులకు చెల్లించామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు