
నాగర్ కర్నూల్, 29 మే (హి.స.)
నాగర్ కర్నూలు జల్లా మక్తల్ లో శుక్రవారం మంత్రి వాకిటి శ్రీహరి పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
మహిళా కళాశాల కోసం స్థలానికి వారం పది రోజుల్లో భూమి పూజ చేసి పనులు ప్రారంభిస్తామని . ప్రస్తుతం అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉంటున్నారని చదువులో కూడా అన్ని రకాల వసతులు కల్పించాలని మహిళలందరికీ ఉన్నత చదువులు అందుబాటులో తీసుకురావాలన్న లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
విద్యార్థుల కోసం ఇంటర్ నుంచి పీజీ వరకు ఒకే దగ్గర అనువైన స్థలం అందుబాటులోకి వస్తే భవన నిర్మాణం కోసం ఇప్పటికే 5.9 కోట్ల నిధులు మంజూరైయ్యావన్నారు. మహిళా కాలేజీ విద్యార్థులకు భద్రతాపరంగా ఉండాలనే ఉద్దేశంతో స్థల సేకరణ ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయం వరసలో విశాలమైన స్థలములు నీటిపారుదల శాఖ కార్యాలయం కొనసాగుతుంది. ఆఫీసును ఇతర ప్రాంతాలకు తరలించి ఇక్కడ నూతనంగా మహిళ ఇంటర్, డిగ్రీ, పీజీ మహిళ కళాశాలను శాశ్వత భవనం నిర్మిస్తే ప్రధాన సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న ఉద్దేశమన్నారు .
ప్రస్తుతం అరకొర వసతులతో మహిళా కళాశాలలు కొనసాగుతున్నాయని పక్కా భవనాలు లేక ఏ భవనం అందుబాటులో ఉంటే దానిలో తరగతులు కొనసాగించడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. ఈ విషయం సంబంధిత అధికారులు తన దృష్టికి తీసుకువచ్చారని మహిళా విద్యార్థులకు అన్ని రకాలుగా సౌకర్యం అందుబాటులో ఉండేలా బస్టాండ్, తహసీల్దార్ ఆఫీస్, పోలీస్ స్టేషన్ కనుసన్నల పర్యవేక్షణలో కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం నీటిపారుదల శాఖ కార్యాలయం కొనసాగుతున్న ఆఫీసును ఇతర ప్రాంతాలకు తరలించి.. ఇక్కడ నూతనంగా మహిళ ఇంటర్, డిగ్రీ, పీజీ
మూడంతస్తుల భవనాన్ని నిర్మించి తరగతులు కొనసాగించాలని నిర్ణయించుకోవడం జరిగిందని తెలిపారు. అందుకు పాలనాపరమైన మెంట్లు సర్వే నిర్వహించాలని పంచాయతీ శాఖ డీఈకి మంత్రి ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు