
హైదరాబాద్, 29 మే (హి.స.)
కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించిన ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈ ప్రక్రియ సమయంలో అనుసరించాల్సిన తీరుపై కాంగ్రెస్ పార్టీ తమ నేతలకు శిక్షణను ఇవాళ గాంధీ భవన్లో ప్రారంభించింది. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీపీసీసీ మాస్టర్ ట్రైనీలకు ఏఐసీసీ శిక్షణ విభాగం నుంచి వచ్చిన సౌరబ్, నిశాంత్, అనూష శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న మాస్టర్ ట్రైనీలు నియోజకవర్గాల్లోని బీఎలీలకు శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.. కాంగ్రెస్ను మరింత బలోపేతం చేసేందుకు సమర్థవంతమైన కార్యవర్గాన్ని సిద్ధం చేసేందుకు రాష్ట్రంలో సంఘటన్ సృజన్ అభియాన్ పక్రియ పకడ్బందీగా చేశామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. దాదాపు 90కి పైగా నియోజక వర్గాలలో బీఎల్ ఏ పూర్తి చేశామని చెప్పారు. జిల్లా కమిటీలు, మండల కమిటీ లు దాదాపు పూర్తి చేశామన్నారు. పశ్చిమ బెంగాల్లో 93 లక్షల ఓట్లు తీసేశారని అక్కడ బీజేపీ చేసిన కుట్రలతో ప్రభుత్వమే మారిపోయిందన్నారు. ఇక్కడ అలాంటి కుట్రలు జరగకుండా చూసుకోవాలని హెచ్చరించారు. ప్రతి ఓటును తప్పకుండా చూసుకోవాలని ఇది చాలా కీలకమైన శిక్షణ. దీన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేసుకోవాలన్నారు. దేశంలో బీజేపీ ఒక విషపూరిత కుట్రలు చేస్తూ చేస్తోందని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు