పేకాట స్థావరంపై బెల్లంపల్లి పోలీసుల దాడి.. 9 మంది అరెస్ట్
పేకాట స్థావరంపై బెల్లంపల్లి పోలీసుల దాడి.. 9 మంది అరెస్ట్
Playing cards


మంచిర్యాల, 29 మే (హి.స.)

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని తిరుమల హిల్స్ ఆర్పీ గార్డెన్లో తాళ్ల గురజాల పోలీసులు పేకాట స్థావరంపై గురువారం దాడి చేసి 9 మందిని అరెస్టు చేశారు. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. బెల్లంపల్లి పట్టణంలోని ఆర్ పి గార్డెన్ లో సాయంత్రం పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడి నిర్వహించినట్లు తెలిపారు. పేకాట ఆడుతున్న 9 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి నుంచి రూ.1,28,240 నగదుతో పాటు 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పేకాట ఆడిన వారిలో జె. క్రాంతి కుమార్, డి.శ్రీనివాస్, ఏ.పోషం, తొంగల. వెంకటేష్, గోడిసెల. మణిరాజ్, గాజు. గంగాధర్, సింగతి. రవి, సలేందర్. కేశవ్, ఎండి. ఆఫీస్ నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande