
మేడ్చల్, 29 మే (హి.స.)
ఆరేళ్ల అమాయక బాలిక అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి మేడ్చల్ ఫాస్టాక్ పోక్సో కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ఉత్తరప్రదేశ్కు చెందిన నిందితుడు పరమేశ్ యాదవ్ జవహర్నగర్లో నివాసముంటూ కార్మికుడిగా పని చేస్తున్నాడు. 2024లో జవహర్నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేసును విచారించిన ఫాస్ట్రక్ పోక్సో కోర్టు న్యాయమూర్తి వెంకటేష్ నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించారు. బాధిత బాలికకు రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించారు. ఈ కేసులో జవహర్నగర్ పోలీసులు సమర్పించిన సాక్ష్యాలు, వైద్య ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన అనంతరం కోర్టు ఈ తీర్పు వెలువరించింది. తీర్పు వివరాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభాకర్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు తప్పవని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసిందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు