
హైదరాబాద్, 29 మే (హి.స.)
ఓవైపు ఎండలు, మరోవైపు వానలు,
సూపర్ ఎల్నీనో అంటూ వస్తున్న వార్తలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. 2026 నైరుతి రుతుపవనాల కాలానికి సంబంధించి ఐఎండీ ఈరోజు తన తుది దీర్ఘకాలిక వాతావరణ అంచనాలను (Long-range forecast) విడుదల చేసింది. ఈ సీజన్లో తెలంగాణలో సాధారణం, అంత కంటే ఎక్కువ (Normal to Above Normal) వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ తో పాటు తెలంగాణ లోని ఇతర ప్రాంతాల్లో ఈసారి భారీ వర్షాలు (Excess rainfall) కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లోని మధ్య కోస్తా ప్రాంతాల్లో కూడా రుతుపవనాల ప్రభావం అనుకూలంగా ఉండనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ వర్షాలు ఉభయ రాష్ట్రాల్లోని వ్యవసాయ రంగానికి, తాగునీరు, భూగర్భజల వనరుల పునరుద్ధరణకు ఎంతో ఊరటనిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు