
చర్లపల్లి, 29 మే (హి.స.)
మైనర్ బాలికను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారు బండి భగీరథ్ పోలీసు కస్టడీ ముగిసింది. భగీరథ్ ను పోలీసులు మూడు రోజుల పాటు విచారించారు. విచారణ ముగియడంతో భగీరథ్ ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు చర్లపల్లి జైలుకు తరలించారు.
ఈ కేసు ప్రత్యేక విచారణాధికారి, కూకట్ పల్లి డీసీపీ రితిరాజ్ పర్యవేక్షణలో పోలీసులు భగీరథ్ ను విచారించారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు మొయినాబాద్ ఫామ్ హౌస్ కు కూడా ఆయనను తీసుకెళ్లారు. డిసెంబర్ 31న బాధితురాలిని భగీరథ్ తన స్నేహితులతో కలిసి ఫామ్ హౌస్ కి తీసుకెళ్లి అఘాయిత్యం చేసినట్టు ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. అయితే పోలీసు విచారణలో పలు ప్రశ్నలకు భగీరథ్ సమాధానాలు చెప్పకుండా మౌనంగా ఉన్నట్టు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi