
కదిరి, 29 మే (హి.స.)
ప్రసిద్ధ నవ నారసింహ క్షేత్రాలలో ప్రహ్లాద సమేతంగా స్వయంభువుగా వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం.ఈ క్షేత్రానికి 5 కిలోమీటర్ల దూరంలో కాటమ రాయుడుగా కొండల లక్ష్మీ నారసింహుడుగా వెలసిన స్తోత్రాద్రి అనగా కదిరి కొండపై శ్రీ వారు పాదం మోపారని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
దీని కారణంగా ప్రతి నెల స్వాతి నక్షత్రం సందర్భంగా పెద్దయెత్తున స్తోత్రాద్రి గిరిప్రదక్షిణలో మహిళలు , వృద్ధులు , పిల్లలు , యువకులు పాల్గొంటున్నారు.శ్రీ వారి స్తోత్రాద్రి గిరిప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు ఆలయ అధికారులు , శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి సభ్యులు శ్రీ వారి ప్రసాదం , మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు.నేడు శ్రీ వారి స్తోత్రాద్రి గిరిప్రదక్షిణకు విచ్చేస్తున్న భక్తాదులకు మహా ప్రసాద వితరణ నీలకంఠ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు చేపట్టారు.
శ్రీ వారి స్తోత్రాద్రి గిరిప్రదక్షిణకు అనుకూలంగా ఆలయ అధికారులు ప్రభుత్వ అధికారులు స్పందించి రహదారి మార్గాన్ని నిర్మించి అక్కడ అక్కడ సేద తీరడానికి బెంచీలు , వాష్ రూమ్స్ ముఖ్యంగా శ్రీ కొండల లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి వచ్చే ప్రధాన రహదారిలో ఒక తోరణం ( ఆర్చ్ ) వంటి సదుపాయాలు కల్పిస్తే శ్రీ వారి గిరి ప్రదక్షిణలో మరింత మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంటుందని శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి సభ్యులు మరియు హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పర్యావరణం పరిరక్షణలో భాగంగా శ్రీ వారి ఆలయం చుట్టూ ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతినకుండా వచ్చే నెల నుంచి ప్లాస్టిక్ నిర్మూలించే క్రమంలో ప్లాస్టిక్ పేపర్ ప్లేట్ల స్థానంలో దాతలు అందించిన స్టీల్ ప్లేట్లను మహా ప్రసాద వితరణ కోసం ప్రవేశ పెట్టడం జరుగుతోంది కావున భక్తాదులు మహా ప్రసాదం స్వీకరించిన అనంతరం ప్లేట్లను శుభ్రం చేసి యదా స్థానంలో ఉంచే విధంగా తోడ్పాటు అందించాలి.ప్రతి నెలా స్వాతి నక్షత్రం సందర్భంగా స్తోత్రాద్రి గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తాదులకు , ప్రత్యక్షంగా , పరోక్షంగా తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు శ్రీ వారి ఆశీస్సులు లభించాలని శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి తరపున కోరుకుంటున్నాము.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV