
హైదరాబాద్, 29 మే (హి.స.)
గుండెపోటుతో కాసర్ల పద్మ మరణించారనే వార్త తెలియగానే హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయల్దేరి ఆయన సిరిసిల్లకు వచ్చారు. అనంతరం కాసర్ల పద్మ నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కాసర్ల పద్మకు ఘనంగా నివాళులర్పించారు.
కాసర్ల పద్మ 2020లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పటి మున్సిపల్ ఎన్నికల్లో 27వ కౌన్సిలర్గా పోటీ చేసినప్పటికీ ఆమె ఓడిపోయారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. పది రోజుల కిందట కాసర్ల పద్మ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను కరీంనగర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతున్న సమయంలో గుండెపోటు రావడంతో ఆమె మరణించారు.
పద్మ మృతి పట్ల బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్మన్ జిందం కళా చక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్, పాలకవర్గం, పార్టీ నాయకులు సంతాపం తెలిపారు. కాగా, ఆమెకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi