ఇంధన పొదుపునకు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా వినూత్న ముందడుగు
ఇంధన పొదుపునకు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా వినూత్న ముందడుగు
ఇంధన పొదుపునకు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా వినూత్న ముందడుగు


నంద్యాల, 29 మే (హి.స.)

ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజా సేవను మరింత సమర్థవంతంగా అందించాలనే లక్ష్యంతో జిల్లా అధికారులు సమిష్టి ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. “వన్ మంత్ – ఫోర్ విజిట్” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమానికి హాజరయ్యేందుకు జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా , జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ మరియు ఇతర జిల్లా అధికారులు కలెక్టరేట్ పీజీఆర్ఎస్ ఆవరణ నుంచి ప్రత్యేక బస్సులో బయలుదేరారు.

“ఇంధన పొదుపు – పర్యావరణ పరిరక్షణ – సమిష్టి ప్రయాణం” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో అధికారులు ఒకే వాహనంలో ప్రయాణిస్తూ ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటు పర్యావరణ హిత చర్యలకు ప్రాధాన్యం ఇస్తోందని అధికారులు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande