
అమరావతి, 30 మే (హి.స.)తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల వస్త్ర పరిశ్రమ క్లస్టర్లకు సమీపంలో ఉన్న కుప్పంలో పీఎం మిత్రా పార్కును ఏర్పాటు చేయాలని సీఎం కేంద్రాన్ని కోరారు. సచివాలయంలో శుక్రవారం తనను కలిసిన కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ముందు సీఎం ఈ ప్రతిపాదన ఉంచారు. ఫైబర్ టు ఫ్యాషన్కు అనుకూలించేలా పీఎం మిత్రా పార్కు 2.0ను ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. అమరావతిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి అవసరమైన రూ.280 కోట్లు విడుదల చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. నిఫ్ట్ కోసం అమరావతిలో పదెకరాలు కేటాయించామన్నారు. ఏపీలోని వివిధ వస్త్ర పరిశ్రమ క్లస్టర్లలో ఇంటిగ్రేటెడ్ వెట్ ప్రాసెసింగ్ పార్కులు ఏర్పాటు చేయాలని కోరారు. నేషనల్ న్యూ ఏజ్ ఫైబర్ మిషన్ కింద ఏపీని ప్రాధాన్యత రాష్ట్రంగా గుర్తించాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ