పూర్తి.పారదర్శకంగా డీ ఎస్ సీ స్పోర్ట్స్ కోటా నియామక.ప్రక్రియ
పూర్తి.పారదర్శకంగా డీ ఎస్ సీ స్పోర్ట్స్ కోటా నియామక.ప్రక్రియ
పూర్తి.పారదర్శకంగా డీ ఎస్ సీ స్పోర్ట్స్ కోటా నియామక.ప్రక్రియ


అమరావతి, 30 మే (హి.స.)డీఎస్సీ నియామకాల్లో అక్రమాలంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలను శాప్ ఖండించింది. వైసీపీ చేస్తున్న ఆరోపణలపై నిరుద్యోగ జేఏసీ, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) ఒక ప్రకటన చేస్తూ... ‘డీఎస్సీ-2025 స్పోర్ట్స్ కోటా నియామక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, బహుళస్థాయి ధ్రువీకరణ ఆధారంగా, నియమబద్ధంగా జరిగింది. క్రీడా సర్టిఫికెట్లను సంబంధిత క్రీడా సంఘాలు, ఫెడరేషన్లు, విశ్వవిద్యాలయాలు జారీ చేసా ్తయి. అభ్యర్థులు సమర్పించిన ప్రతి సర్టిఫికెట్ను స ంబం ధిత జారీ సంస్థ ధ్రువీకరించిన తర్వాత మాత్ర మే పరిగణనలోకి తీసుకున్నాం. క్రీడాకారులు సమర్పించిన సర్టిఫికెట్ను సంబంధిత జారీ సంస్థకు పంపించి, అక్కడ అధికారికంగా ధ్రవీకరించుకుంటాం. స్పోర్ట్స్ కోటా కింద డీఎస్సీ నియామకాలపై తప్పుడు వార్తలతో దుష్ప్రచారం చేస్తూ, అపోహలు సృష్టిస్తూ ప్రజల్లో అస్థిరతను కలిగించే ప్రయత్నాలను శాప్ ఏమాత్రం సహించదు’ అని పేర్కొంది.

కూటమి ప్రభు త్వం మెగా డీఎస్సీతో ఒకేసారి 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధిక్ విమర్శించారు. గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేస్తే... కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా నే మెగా డీఎస్సీతో పోస్టులు భర్తీ చేసిందన్నారు. మం త్రి కొండపల్లి శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘మెగా డీఎస్సీని ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా నిర్వహించింది. ప్రభుత్వానికి మంచిపేరు రావడంతో తట్టుకోలేని వైసీపీ నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్న్నారు’ అని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని 204 స్వయం సహాయక మండల సమాఖ్యలకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(సీఐఎఫ్) కింద రూ.50.68 కోట్లు మంజూరుచేసినట్లు సెర్ప్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక న్యాయం, పారదర్శకత, లక్ష్య సాధన సూత్రాల ఆధారంగా ఈ నిధులు వినియోగించాలని మంత్రి ఆదేశించారు. మొత్తం నిధుల్లో జనరల్ కేటగిరీకి రూ.35.08 కోట్లు, ఎస్సీలకు రూ.11.70 కోట్లు, ఎస్టీలకు రూ.3.90 కోట్లు కేటాయించారు. ఒక్కో మండల సమాఖ్యకు రూ.25 లక్షల చొప్పున మంజూరుచేయగా, రంపచోడవం మండల సమాఖ్యకు రూ.5.68లక్షలు రంగంపేట మండల సమాఖ్యకు రూ.12.99 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. ఒక్కో గ్రామ సమాఖ్యకు గరిష్ఠంగా రూ.4.50 లక్షలు, స్వయం సహాయక సంఘానికి రూ.1.50 లక్షలు, ఒక్కో సభ్యురాలికి రూ.50 వేలు రుణం మంజూరుచేయవచ్చు. ఎస్సీ, ఎస్టీ సంఘాలకు ప్రాధాన్యమివ్వాలని, ఇప్పటివరకు సీఐఎఫ్ పొందని, అర్హతగల సంఘాలకు మొదటి ప్రాధాన్యమివ్వాలని మంత్రి సూచించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande