రాయలచెరువులో తగ్గిన నీటిమట్టం
రాయలచెరువులో తగ్గిన నీటిమట్టం
Water level in Rayala Lake has decreased


రామచంద్రాపురం,, 30 మే (హి.స.)మూడేళ్లుగా సరైన వర్షాలు కురవని కారణంగా రాయలచెరువులో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఈ ఖరీ్ఫ సీజన్కు సాగునీటి కష్టాలు తప్పేలా లేవు.రామచంద్రాపురం మండలంలోని అతిపెద్దదైన రాయలచెరువు 2021 తరువాత పూర్తిస్థాయిలో నిండలేదు. అంతంతమాత్రంగా వర్షాలు కురవడంతో చెరువులో నీటిని కొలిచే మూడు మిద్దెల్లో రెండు మాత్రమే మునిగాయి. మూడవ మిద్దె పూర్తిగా మునిగి మరో పదిఅడుగులు ఎత్తుకు చెరువులో నీరు చేరితే నిండినట్లు లెక్క. మరో మూడు నెలలు వర్షాలు కురవకపోతే చెరువు అడుగంటే పరిస్థితి. రాయలచెరువు నుంచి ప్రధాన కాలువ రెండు కిలోమీటర్ల దూరంలోనే గంగిరెడ్డిపల్లె వరకు ఉండగా ప్రస్తుతం పీవీపురం వరకు మాత్రమే నీరు వస్తోంది. ఈ నీరు అటు ఇటు వంద ఎకరాలకు కూడా చాలడంలేదు. చెరువు పూర్తిస్థాయిలో నిండితే దాదాపు వెయ్యి ఎకరాలకు సాగునీరందుతుంది. ఈ జనవరికే రాయలచెరువులో నీళ్లు మూడొంతులు ఖాళీ అయిపోయాయి. చెరువులో నీరు నిల్వ ఉంటేనే బోర్లు, బావుల్లో నీరు పుష్కలంగా ఉంటుంది. నీటి మట్టం తగ్గిపోవడంతో గంగిరెడ్డిపల్లె, నడవలూరు, కమ్మకండ్రిగ ప్రాంతాల్లో నీటిమట్టం తగ్గిపోయింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande