
కర్నూలు , 30 మే (హి.స.): కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా పెట్రోల్, డీజిల్ తరలించి కౌతాళం మండలం ఉరుకుంద గ్రామంలో విక్రయిస్తున్న వారిపై అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.
జిల్లా పౌరసరఫరాల అధికారి రాజా రఘువీర్ ఆధ్వర్యంలో జరిపిన దాడుల్లో 1060 లీటర్ల డీజిల్, 150 లీటర్ల పెట్రోల్ను (మొత్తం 1,210 లీటర్లు) స్వాధీనం చేసుకు న్నారు. నిత్యావసర సరుకుల చట్టం-1955 సెక్షన 6ఏ కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమ ఇంధన విక్రయాల వల్ల రాష్ట్ర ఆదాయానికి భారీ గండి పడుతుందని అన్నారు. ఈ దాడు ల్లో డిప్యూటీ తహసీల్దార్ రుద్రగౌడు, ఆర్ఐ తిక్కస్వామి, వీఆర్వో శివానంద, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV