తమ కుమార్తె వివాహానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన కుష్బూ, సుందర్ దంపతులు
తమ కుమార్తె వివాహానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన కుష్బూ, సుందర్ దంపతులు
kushbu


హైదరాబాద్, 30 మే (హి.స.)

ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు కుష్బూ సుందర్, ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు సుందర్ సి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. తమ పెద్ద కుమార్తె అవంతిక సుందర్ వివాహ మహోత్సవానికి హాజరు కావాల్సిందిగా వారు ప్రధానిని వ్యక్తిగతంగా ఆహ్వానించారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో కుష్బూ దంపతులతో పాటు వారి కుమార్తె అవంతిక, కాబోయే అల్లుడు శ్రవణ్ శ్రీనివాసన్ కూడా ఉన్నారు.

ఈ సందర్భంగా కుష్బూ దంపతులు ప్రధాని మోదీకి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి, నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. అనంతరం ప్రధానితో భేటీకి సంబంధించిన ఫోటోలను కుష్బూ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు.

ఈరోజు ఢిల్లీలో గౌరవనీయ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారిని కలుసుకునే గౌరవం దక్కింది. నా భర్త సుందర్ సి, నేను కలిసి మా కుమార్తె అవంతిక, శ్రవణ్ శ్రీనివాసన్ల వివాహానికి ఆయనను ఆహ్వానించాము. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మాకు సమయం కేటాయించి, వధూవరులను ఆశీర్వదించిన ప్రధానికి మా కృతజ్ఞతలు. ఇది మాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాం అని కుష్బూ తన పోస్ట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కాగా, ఖుష్బూ దంపతుల చిన్న కుమార్తె అయిన అవంతిక నటిగా మలయాళంలో అరంగేట్రం చేయనున్నారు. ఆరంభం అనే మూవీలో ఆమె నటిస్తున్నారు. పెద్ద కుమార్తె ఆనందిక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande