శ్రీకాళహస్తిలో జనసేన నేత బండి మనోహర్!
మదనపల్లె, 30 మే (హి.స.) :అన్నమయ్య జిల్లా, మదనపల్లెకు చెందిన బి.సి జనసేన నాయకులు బండి మనోహర్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి టెంపుల్ ను సందర్శించి శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయంల
mla-ramachandra-reddy-gets-grand-welcome-by-ysrcp-leaders-at-rogyavaram-154122#google_vignette


మదనపల్లె, 30 మే (హి.స.) :అన్నమయ్య జిల్లా, మదనపల్లెకు చెందిన బి.సి జనసేన నాయకులు బండి మనోహర్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి టెంపుల్ ను సందర్శించి శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా దంపతులు రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రంలో అభివృద్ధి, శాంతి నెలకొనాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆలయ అర్చకులు వారికి వేద ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు ఇచ్చారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ దర్శనం భక్తిపూర్వకంగా సాగిందని, స్వామివారి దర్శనం ఎంతో ఆనందాన్ని కలిగించిందని బండి మనోహర్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande