
విశాఖపట్నం, 04 మే (హి.స.)
ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి ఈ ఎన్నికల ఫలితాలే స్పష్టమైన నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీయన్ మాధవ్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘వికసిత్ భారత్’ లక్ష్యంతో దేశం ముందుకు సాగాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, నితిన్ నబిన్ నాయకత్వంపై ప్రజలకు గట్టి నమ్మకం ఉందని వెల్లడించారు. బీజేపీ విజయానికి కృషి చేసిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ లభించిందని.. తమిళనాడులో హంగ్ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని మాధవ్ అన్నారు. తమిళనాడు, కేరళం రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఓటు శాతంలో గణనీయమైన పెరుగుదల నమోదు అయ్యిందన్నారు. అభివృద్ధి, జాతీయ భద్రత, పారదర్శక పాలనకు ప్రజలు పూర్తి మద్దతు ఇచ్చారన్నారు. కేంద్ర సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు, డిజిటల్ పురోగతికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయన్నారు. యువత, మహిళలు, రైతులు, మధ్యతరగతి మద్దతే విజయానికి కీలకంగా మారిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి కృషి.. నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటామన్నారు. దేశాభివృద్ధి కోసం అందరూ ఏకమై ముందుకు రావాలని మాధవ్ పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ