అమరావతి.రాజధాని అభివృద్ధి నిర్విరామంగా కొనసాగాలని ముదినేపల్లి లో రాజా శ్యామల మహాయజ్ఞం
అమరావతి.రాజధాని అభివృద్ధి నిర్విరామంగా కొనసాగాలని ముదినేపల్లి లో రాజా శ్యామల మహాయజ్ఞం
అమరావతి.రాజధాని అభివృద్ధి నిర్విరామంగా కొనసాగాలని ముదినేపల్లి లో రాజా శ్యామల మహాయజ్ఞం

కైకలూరు, 04 మే (హి.స.)

అమరావతి రాజధాని అభివృద్ధి నిర్విరామంగా కొనసాగాలని కాంక్షిస్తూ ముదినేపల్లిలో అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి శ్రీ రాజ శ్యామల మహాయజ్ఞం నిర్వహించారు. అమరావతి ప్రపంచ స్థాయిలో మేటి రాజధానిగా నిలిచి రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు కలగాలని కోరుతూ సోమవారం తన నివాసం వద్ద తండ్రి మనోజ్తో కలిసి యజ్ఞాది, పూజా కార్యక్రమాలు చేశారు. రాజధానికి చట్టబద్ధత కల్పిచడం, ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీక అని ఆమె పేర్కొన్నారు. భావితరాల కోసం అమరావతి అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషి వర్ణనాతీతమన్నారు. రాజధాని అభివృద్ధికి అంబాసిడర్గా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. రూ.116 విరాళం అందించి ప్రజా రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువత, విద్యార్థులు, ప్రజల సహకారంతో ప్రజా రాజధాని కోసం రూ.100 కోట్ల విరాళాలు సేకరించడమే లక్ష్యమన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande