శ్రీ.పొట్టి శ్రీ రాములు బేలూరు జిల్లా సీతారామపురం లో విషాద ఛాయలు
శ్రీ.పొట్టి శ్రీ రాములు బేలూరు జిల్లా సీతారామపురం లో విషాద ఛాయలు
శ్రీ.పొట్టి శ్రీ రాములు బేలూరు జిల్లా సీతారామపురం లో విషాద ఛాయలు

సీతారామపురం, 04 మే (హి.స.)

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురంలో విషాదఛాయలు అలముకున్నాయి. సీతారామపురం ఊర చెరువులోకి ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు నీటిలో మునిగి మృత్యువాతపడ్డారు. మృతి చెందిన చిన్నారులు రేవంత్(14), ఆది (12) కానిస్టేబుల్గా పనిచేస్తున్న సుబ్బారావు కుమారులుగా గుర్తించారు. వారిని కాపాడేందుకు వెళ్లిన పిల్లల పిన్ని (చిన్నమ్మ) సైతం నీటిలో మునిగిపోయే క్రమంలో స్థానికులు కాపాడారు. 108 వాహనంలో ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నీటిలో నుంచి పిల్లలను జాలర్లు ఒడ్డుకు తీసుకొచ్చరు. అప్పటికే వారు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాల సేకరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande