
హైదరాబాద్, 04 మే (హి.స.)తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు ఇండియా కూటమికి బుద్ధి చెప్పారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. ఈ ఫలితాలను చూస్తే తెలంగాణలోనూ భాజపా అధికారంలోకి వస్తుందనేది స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు. గత 33 ఏళ్లు కమ్యూనిస్టులు, 15 ఏళ్లు తృణమూల్ పాలించిన బెంగాల్ కోటలో భాజపా విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు.
అస్సాంలో మూడోసారి భాజపా కూటమి అధికారంలోకి వస్తోందన్నారు. కుటుంబ రహిత, అవినీతి రహిత పాలన అందించాం కాబట్టే.. అస్సాంలో మళ్లీ తమ పార్టీ విజయం సాధించిందని తెలిపారు. ఉత్తరాది, దక్షిణాది వైషమ్యాలు సృష్టించిన ఇండియా కూటమికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. తమిళనాడులో అధికార డీఏంకే పార్టీ తుడిచి పెట్టుకుపోతుందన్నారు.
కూకట్పల్లి నుంచి మైనార్టీలు భాజపాలో చేరారని.. ముస్లిం మహిళలు మోదీని పెద్దన్నగా భావిస్తున్నారన్నారు. మే 10న పరేడ్ మైదానంలో జరిగే బహిరంగ సభకు పెద్దఎత్తున జనం తరలిరావాలని పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్