కేరళలో కాంగ్రెస్ విజయం వెనక రేవంత్రెడ్డి వ్యూహాలు: అద్దంకి దయాకర్
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ విజయం సాధించింది.
Addanki Dayakar


హైదరాబాద్, 04 మే (హి.స.) కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ విజయం సాధించింది. ఈ విజయం వెనక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు ఉన్నాయని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. యూడీఎఫ్ విజయంలో సీఎం రేవంత్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహారించారని పేర్కొన్నారు. కేరళ సీఎం విజయన్పై.. రేవంత్ రెడ్డి నేరుగా విమర్శలు ఎక్కుపెట్టారని గుర్తు చేశారు. కేరళ అభివృద్ధిపై విజయన్ను నిలదీయడంతోపాటు లేఖలు కూడా రాశారని పేర్కొన్నారు. అదే సమయంలో తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కేరళ ప్రచారంలో రేవంత్రెడ్డి వివరించారన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande