దేశంలో కాంగ్రెస్ పని ఖతమైంది.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
దేశంలో కాంగ్రెస్ పని ఖతమైంది.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
బండి సంజయ్


హైదరాబాద్, 04 మే (హి.స.)

ఐదు రాష్ట్రాల్లో వెలువడుతున్నఅసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ (Congress) పార్టీ భవిష్యత్తుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇక ఎప్పటికీ అధికారంలోకి రాదని, ప్రజలు కాంగ్రెస్ను పూర్తిగా తిరస్కరించారని అన్నారు. దేశ రాజకీయ ముఖచిత్రం నుంచి హస్తం పార్టీ కనుమరుగవుతోందని, ఆ పార్టీ మళ్లీ అధికార పీఠం ఎక్కడం అసాధ్యమని జోస్యం చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు (Women's Reservation Bill), నియోజకవర్గాల పునర్విభజన బిల్లు (Constituency Delimitation Bill) వంటి చారిత్రాత్మక నిర్ణయాలను వ్యతిరేకించిన పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారంటూ సెటైర్లు వేశారు. అభివృద్ధికి అడ్డుపడుతున్న పార్టీలను ఎట్టి పరిస్థితుల్లో ఓటర్లు క్షమించరని బండి సంజయ్ గుర్తు చేశారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని ఓ పరిపూర్ణ రాజకీయ నాయకుడిగా కనీసం ఆ పార్టీ నేతలే గుర్తించడం లేదని బండి సంజయ్ విమర్శనాస్త్రాలు సంధించారు. నాయకత్వ పటిమ లేని రాహుల్ వల్ల కాంగ్రెస్ పాతాలానికి పడిపోతోందని అన్నారు. ప్రజా వ్యతిరేక రాజకీయాలు చేసే పార్టీలకు కాలం చెల్లిందని, మహిళా బిల్లు వంటి అంశాల్లో కాంగ్రెస్ వైఖరి వారి పతనానికి దారితీస్తోందని బండి సంజయ్ స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande