విజయ్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. తీవ్రంగా స్పందించిన డీఎంకే
విజయ్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. తీవ్రంగా స్పందించిన డీఎంకే
విజయ్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. తీవ్రంగా స్పందించిన డీఎంకే


చెన్నై, 06 మే (హి.స.)

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంపై డీఎంకే పార్టీ తీవ్రంగా స్పందించింది. డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇలంగోవన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కొంతమంది ప్రజాప్రతినిధులు మొదటి నుంచి విజయ్కి మద్దతు ఇవ్వాలనే అభిప్రాయంతో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రతి రాష్ట్రంలో ఇలాగే చేస్తోందని విమర్శించారు. ఆ పార్టీ వ్యవహారశైలి కారణంగానే వరుసగా అన్ని రాష్ట్రాల్లో ఓడిపోతోందని అన్నారు.

గత సంవత్సరం ఢిల్లీ, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ఆయన మండిపడ్డారు. మహారాష్ట్రలో వారికి ఏమాత్రం అవకాశం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా మూసివేసే పనులనే వారు చేస్తున్నారని విమర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande