
న్యూఢిల్లీ, 07 మే (హి.స.)
కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియా నేడు (మే 7, 2026) ఢిల్లీలో నవీకరించిన నెహ్రూ ప్లేస్ పోస్ట్ ఆఫీస్ భవనాన్ని ప్రజలకు అంకితం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్త మరియు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని కూడా పాల్గొన్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన పోస్టల్ శాఖను ఆధునిక సాంకేతికతతో అనుసంధానం చేస్తూ, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే ఈ నవీకరణ ప్రధాన ఉద్దేశ్యం.ప్రధాని మోదీ అభివృద్ధి దార్శనికతలో భాగంగా దేశవ్యాప్తంగా పోస్ట్ ఆఫీసులను ఆధునీకరిస్తున్నామని, అందులో భాగంగానే ఈ భవనాన్ని అత్యాధునిక మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దినట్లు మంత్రి పేర్కొన్నారు. దీనికి ముందు రోజే (మే 6న) మేఘాలయలోని షిల్లాంగ్లో దేశవ్యాప్తంగా నిర్మించిన 100వ ఎన్-జెన్ (N-Gen) పోస్ట్ ఆఫీస్ను కూడా సింధియా వర్చువల్గా ప్రారంభించారు. దక్షిణ ఢిల్లీలో ఈ పోస్ట్ ఆఫీస్ ఆధునీకరణ వల్ల స్థానిక వ్యాపారులకు మరియు ప్రజలకు పోస్టల్ సేవల వినియోగం మరింత సులభతరం కానుంది.
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi