డీఎంకే సంచలన నిర్ణయం- ఇండియా కూటమికి గుడ్బై- లోక్సభ స్పీకర్కు కనిమొళి లేఖ
డీఎంకే సంచలన నిర్ణయం- ఇండియా కూటమికి గుడ్బై- లోక్సభ స్పీకర్కు కనిమొళి లేఖ
డీఎంకే సంచలన నిర్ణయం- ఇండియా కూటమికి గుడ్బై- లోక్సభ స్పీకర్కు కనిమొళి లేఖ


హైదరాబాద్, 08 మే (హి.స.)

తమిళనాడులో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఇండియా కూటమికి డీఎంకే గుడ్బై చెప్పింది. లోక్సభలో తాము కూర్చునే సీట్లను మార్చాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను డీఎంకే ఎంపీ కనిమొళి కోరారు. డీఎంకే ఎంపీలకు ప్రత్యేక సీట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా తమ ఎంపీలు లోక్సభలో తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడానికి వీలవుతుందని తెలిపారు. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్తో డీఎంకే పార్టీ పొత్తు ముగిసిపోయిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో డీఎంకే ఎంపీలు ఇకపై కాంగ్రెస్ ఎంపీల పక్కనే కూర్చోవడం సముచితం కాదని అభిప్రాయపడ్డారు. తన అభ్యర్థనను స్పీకర్ కార్యాలయం తగిన విధంగా పరిశీలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు కనిమొళి లేఖ రాశారు. కాగా, విజయ్ టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు తెలపింది. దీంతో హస్తం పార్టీ, డీఎంకే సుదీర్ఘ పొత్తు బంధం ముగిసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande