
భువనేశ్వర్, 08 మే (హి.స.)
కొత్త తరహా ఆయుధాన్ని డీఆర్డీవో పరీక్షించింది. తారా గ్లైడ్ వెపన్ సిస్టమ్( TARA glide weapon system) బాంబును ఒడిశా తీరంలో విజయవంతంగా పరీక్షించారు. తారా అంటే టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ ఆగుమెంటేషన్(టీఏఆర్ఏ). ఇదొకరమైన బాంబు. స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని అభివృద్ధి చేశారు. సంప్రదాయకరమైన వార్హెడ్స్తో ఈ సిస్టమ్ ద్వారా కచ్చితమైన టార్గెట్లను ధ్వంసం చేయవచ్చు. గ్లైడింగ్ తరహాలో ఈ వెపన్ సిస్టమ్ పనిచేస్తుంది. డీఆర్డీవో, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా ఈ పరీక్ష నిర్వహించాయి. తక్కువ ఖర్చుతో ఈ బాంబును రూపొందించారు. స్వదేశీయంగా తయారైన తొలి గ్లైడ్ వెపన్ సిస్టమ్ ఇది అని కేంద్ర రక్షణ శాఖ చెప్పింది. హైదరాబాద్కు చెందిన రీసర్చ్ సెంటర్ ఇమారత్ దీన్ని డెవలప్ చేసింది. కొన్ని డీఆర్డీవో ల్యాబ్లు కూడా దీంట్లో కీలక పాత్ర పోషించాయి. సంప్రదాయకర బాంబుల తరహాలో కాకుండా.. గ్లైడ్ వెపన్స్.. ఏరోడైనమిక్ తరహా పనిచేస్తాయి. ఈ బాంబును వదిలిన తర్వాత టార్గెట్ను చేరేందుకు ఆ వెపన్ గ్లైడింగ్ చేస్తుంది. కొంత దూరం ఇలా ఆ బాంబు ట్రావెల్ చేయగలదు. మాడ్యులార్ రేంజ్ ఎక్స్టెన్షన్ కిట్గా దీన్ని భావిస్తున్నారు. దిశా నిర్దేశం లేని బాంబులను ఈ టెక్నాలజీ ద్వారా అనుకున్న లక్ష్యం చేరే రీతిలో గ్లైడ్ చేస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi