శిథిలావస్థ నుంచి పునరుద్ధరణ దాకా సోమనాథ్ ప్రస్థానం- 1000రోజుల ప్రత్యేక పూజలు- ప్రధాని మోదీ సంపాదకీయం
శిథిలావస్థ నుంచి పునరుద్ధరణ దాకా సోమనాథ్ ప్రస్థానం- 1000రోజుల ప్రత్యేక పూజలు- ప్రధాని మోదీ సంపాదకీయం
మోదీ


సోమనాథ్, 08 మే (హి.స.)

గుజరాత్లోని ప్రసిద్ధ సోమనాథ్ ఆలయ ప్రస్థానం శిథిలావస్థ నుంచి పునరుద్ధరణ దాకా, విధ్వంసం నుంచి సృజన దాకా సాగిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. పదేపదే దాడులు, విధ్వంసాలు ఎదురైనా సోమనాథ్ ఆలయం పునరుద్ధరణకు, కొనసాగింపునకు ప్రతీకగా నిలుస్తూ భారతీయులకు నాగరికతాపరమైన సందేశాన్ని ఇస్తోందన్నారు. ఈ ఆలయ పరిరక్షణ, పునరుద్ధరణతో సంబంధమున్న సర్దార్ వల్లభాయ్ పటేల్, కేఎం మున్షీ, అహల్యాబాయి హోల్కర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వంటి చారిత్రక ప్రముఖులను ప్రధాని స్మరించుకున్నారు. శతాబ్దాలుగా ఆలయం కోసం త్యాగాలు చేసిన వారికి నివాళిగా, రాబోయే 1000 రోజుల పాటు సోమనాథ్లో ప్రత్యేక పూజలను నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.

సోమనాథ్ ఆలయాన్ని మే 11న సందర్శించనున్న సందర్భంగా ఆ ఆలయం ప్రాముఖ్యతపై ప్రధాని మోదీ శుక్రవారం ఓ సంపాదకీయాన్ని రాశారు. ఈవిషయాన్ని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన వెల్లడించారు. అన్ని రకాల సవాళ్లను ఎదుర్కొని సోమనాథ్ను ఎల్లప్పుడూ పరిరక్షించి, దాని పూర్వ వైభవాన్ని పునరుద్ధరించిన ప్రతి ఒక్కరికీ తన సంపాదకీయంలో నివాళులు అర్పించానని ప్రధాని తెలిపారు. భారతీయ నాగరికత గొప్పతనం విషయంలో సోమనాథ్ ఎల్లప్పుడూ ఎందుకు ముఖ్యమైందో అందులో వివరించినట్లు చెప్పారు. తన సోమనాథ్ పర్యటన వివరాలనూ సంపాదకీయంలో ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయాన్ని 1951 మే 11న భారతదేశపు మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తాను సోమనాథ్ సందర్శనకు వెళ్తున్నట్లు మోదీ వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande