ఢిల్లీ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ. 35 కోట్ల విలువైన గంజాయి సీజ్
ఢిల్లీ ఎయిర్పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత.. రూ. 35 కోట్ల విలువైన గంజాయి సీజ్
Drugs


న్యూఢిల్లీ, 09 మే (హి.స.)

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ డ్రగ్స్ నెట్వర్క్ ను(Huge drugs network) చేదించారు . బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను తనిఖీ చేయగా, వారి వద్ద సుమారు 35 కిలోల అత్యంత నాణ్యమైన హైడ్రోపోనిక్ గంజాయి లభ్యమైంది. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ దాదాపు రూ. 34.93 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అడ్వాన్స్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (APIS) ద్వారా సేకరించిన సమాచారంతో ప్రయాణికుల ప్రొఫైలింగ్ను నిశితంగా పరిశీలించిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) ఈ ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించింది.

విభాగం పట్టుబడిన డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్న అధికారులు, నిందితులను అరెస్ట్ చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు. పక్కా సమాచారంతో మాదకద్రవ్యాల స్మగ్లింగ్ను అడ్డుకోవడంలో కస్టమ్స్ అప్రమత్తతను ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది. బ్యాంకాక్ నుంచి భారత్ క్కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ప్రధాన ముఠాల గురించి నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande