
జైపూర్, 09 మే (హి.స.)
ఐపీఎల్ 2026లో నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ తన సొంత గడ్డపై ఇవాళ గుజరాత్ టైటాన్స్ తో తలపడనుంది. గత ఐదు మ్యాచ్ లలో మూడు ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్, ఇవాళ గెలిస్తే ప్లే ఆఫ్స్ కు వెళ్లడం మరింత సులభం అవుతుంది. లేదంటే వచ్చే మూడు మ్యాచ్ లలో రెండు తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంటుంది.
కానీ రాజస్థాన్ రాయల్స్ ఆడాల్సిన తర్వాతి మ్యాచ్ మే 17వ తేదీన ఉంది. చాలా రోజుల గ్యాప్ ఉన్న నేపథ్యంలో పాయింట్ల పట్టికలో మార్పులు జరిగి.. రాజస్థాన్ రాయల్స్ పై ఒత్తిడి భారీగా పెరిగే ప్రమాదం ఉంటుంది. ఈ క్రమంలో ఇవాళ గుజరాత్ పైన గెలిస్తే, రాజస్థాన్ రాయల్స్ కు రిలీఫ్ దక్కనుంది. మరోవైపు హ్యాట్రిక్ విజయాలతో జోరు మీద ఉన్న గుజరాత్ టైటాన్స్, ఈ రోజు గెలిచి టాప్ 4లోకి వెళ్లాలని భావిస్తోంది. మరి ఎవరు గెలుస్తారో చూడాలి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..