'ఎమ్మెల్యే కామరాజ్ కనిపించడం లేదు'- TVKపై గవర్నర్కు ఏఎంఎంకే ఫిర్యాదు
'ఎమ్మెల్యే కామరాజ్ కనిపించడం లేదు'- TVKపై గవర్నర్కు ఏఎంఎంకే ఫిర్యాదు
TVK Vijay


చెన్నై, 09 మే (హి.స.)

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. శుక్రవారం గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ను మూడోసారి కలిసిన టీవీకే అధినేత విజయ్కు మళ్లీ నిరాశే ఎదురైంది. మరోవైపు ఐయూఎంఎల్ విజయ్కి మద్దతిచ్చినట్లే ఇచ్చి తప్పుకోవడంతో టీవీకే బలం 116కు పడిపోయింది. ఈ క్రమంలో రెండు సీట్లు ఉన్న వీసీకే పార్టీ తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈరోజు వీసీకే అధికారికంగా టీవీకేకు మద్దతిస్తే ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉంది. ఈ పరిణామాలతో ఈరోజు జరగాల్సిన విజయ్ ప్రమాణస్వీకారం వాయిదా పడినట్లే కనిపిస్తోంది.

టీవీకేపై ఏఎంఎంకే పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ ఏకైక ఎమ్మెల్యే మద్దతిచ్చినట్లుగా ఉన్న లేఖను టీవీకే పార్టీ ఫోర్జరీ చేసిందని ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్ ఆరోపించారు. అంతేకాకుండా ఎమ్మెల్యే కామరాజ్ కల్పించడం లేదని గవర్నర్కు ఫిర్యాదు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande