ఢిల్లీ బీజేపీ కార్యాలయానికి ఉగ్ర ముప్పు.
ఢిల్లీ, 09 మే (హి.స.)దేశ రాజధాని లో మరోసారి ఉగ్రవాదులు పంజా విసిరే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ (DDU) మార్గ్‌లోని భారతీయ జనతా పార్టీ (BJP) కేంద్ర కార్యాలయంతో పాటు సమీపంలోని కీలక ప్రభుత్వ సంస్థలే లక్ష్
ఢిల్లీ బీజేపీ కార్యాలయానికి ఉగ్ర ముప్పు.


ఢిల్లీ, 09 మే (హి.స.)దేశ రాజధాని లో మరోసారి ఉగ్రవాదులు పంజా విసిరే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ (DDU) మార్గ్‌లోని భారతీయ జనతా పార్టీ (BJP) కేంద్ర కార్యాలయంతో పాటు సమీపంలోని కీలక ప్రభుత్వ సంస్థలే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో భద్రతా సంస్థలు అప్రమత్తమై బీజేపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను, పారామిలటరీ దళాలను మోహరించాయి.

ఆత్మాహుతి దాడులు, కారు బాంబులతో కుట్ర!

నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. ఉగ్రవాద సంస్థలు ఈసారి అత్యంత విధ్వంసకర పద్ధతులను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆత్మాహుతి దాడులు, కారు బాంబు పేలుళ్లు, కాల్పులకు తెగబడటం లేదా ఐఈడీలను అమర్చడం వంటి కుట్రలు పన్నుతున్నట్లు హెచ్చరికలు అందాయి. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే తక్షణమే స్పందించేలా స్పెషల్ ఫోర్స్ రెడీగా ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande