బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సువేందు అధికారి
బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సువేందు అధికారి
suvendu


కలకత్తా, మార్చి 9 (హి.స)

పశ్చిమ బెంగాల్

రాజకీయాల్లో ఒక సుదీర్ఘ నిరీక్షణకు ఈరోజు తెరపడింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి

మమతా బెనర్జీకి ఒకప్పుడు అత్యంత సన్నిహితుడిగా, ఆమె రాజకీయ

వ్యూహాల్లో కీలక పాత్ర పోషించిన సువేందు అధికారి... ఈరోజు అదే బెంగాల్ గడ్డపై

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టిన మమత

దగ్గరే రాజకీయ ఓనమాలు నేర్చుకుని, చివరకు ఆమెనే ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం ఒక

పక్కా పొలిటికల్ థ్రిల్లర్ను తలపిస్తోంది.

సువేందు అధికారి

ప్రస్థానం నిజంగానే అద్భుతమని చెప్పొచ్చు. నందిగ్రామ్, భవానీపూర్

ఉద్యమాల్లో మమతకు వెన్నెముకగా నిలిచిన ఆయన, నేడు ఆమె కూర్చున్న కుర్చీలోనే ముఖ్యమంత్రిగా ఆసీనులయ్యారు.

బెంగాల్ ఓటర్లు ఆయనకు పట్టం కట్టడం ద్వారా రాష్ట్రంలో ఒక కొత్త శకానికి నాంది

పలికారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ సీఎం

చంద్రబాబుతో పాటు పలువుకు అగ్ర నేతలు స్వయంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇక

ఆయనతో పాటు అయిదు మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. సువేందు క్యాబినెట్లో

దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పౌల్, నిశిత్

ప్రమాణిక్, క్షుదిరామ్ తుడు, అశోక్

కీర్తనియా ఉన్నారు. ప్రధాని మోదీ, హోంశాఖ

మంత్రి అమిత్ షా సమక్షంలోనే అయిదుగురు మంత్రులు ప్రమాణం చేశారు. దిలీష్ ఘోష్..

సీనియర్ బీజేపీ నేత. ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చేశారు. ఆర్ఎస్ఎస్తో అతనికి

అనుబంధం ఉన్నది. ఫుల్ టైం ప్రచారం నిర్వహించారు. 2014

తర్వాత బెంగాల్లో బీజేపీ వ్యాప్తి గ్రామీణ స్థాయిలో ఆయన పనిచేశారు. గతంలో

మిడ్నాపూర్ లోక్సభ నుంచి ఎన్నికయ్యారు.

ఇవాళ ప్రమాణం

చేసిన మంత్రుల్లో ఓ మహిళ ఉన్నారు. ఆమే అగ్నిమిత్ర పౌల్. ఫ్యాషన్ డిజైనర్ నుంచి

రాజకీయవేత్తగా ఎదిగారు. బీజేపీ బెంగాల్ క్యాబినెట్లో ప్రస్తుతం ఆమె ఏకైక మహిళ.

2019లో ఆమె బీజేపీలో

చేరారు. ఆ తర్వాత ఆ రాష్ట్ర మహిళా మోర్చ అధ్యక్షురాలయ్యారు. 2021లో బీజేపీ జనరల్

సెక్రటరీగా ఆమె నియమితురాలయ్యారు. బీజేపీ ఉపాధ్యక్షురాలిగా ఈ ఏడాది ఆరంభంలో

అగ్నిమిత్ర అపాయింట్ అయ్యారు.

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande