మోదీ ఐరోపా పర్యటన: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనల పూర్తి వివరాలు
మోదీ ఐరోపా పర్యటన: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనల పూర్తి వివరాలు
Prime Minister Modi gave a message of nature and prosperity


న్యూఢిల్లీ 13 జూన్ (హి.స.)భారత ప్రధాని నరేంద్ర మోదీ జూన్

13 నుంచి 18 వరకు ఫ్రాన్స్, స్లోవేకియా దేశాలలో ఆరు రోజుల

పాటు ఉన్నత స్థాయి దౌత్య పర్యటన చేపట్టారు.రక్షణ, సాంకేతికత మరియు ఆర్థిక

భాగస్వామ్యాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ పర్యటన సాగనుంది

పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ

మొదట ఫ్రాన్స్లోని నీస్ (Nice) నగరానికి చేరుకుని, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్

మాక్రాన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక

భాగస్వామ్యాన్ని సమీక్షించడంతో పాటు, భారతీయ స్టార్టప్లను

అంతర్జాతీయ పెట్టుబడులతో అనుసంధానించే 'భారత్ ఇన్నోవేట్స్' కార్యక్రమాన్ని ఇరు నేతలు

ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఎవియాన్లో జరిగే 52వ జీ-7 (G7) శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని మోదీ

ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవుతారు. ఈ సదస్సులో గ్లోబల్ సౌత్ దేశాల ఆకాంక్షలను

వినిపించడంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు గ్లోబల్ సప్లై చైన్

బలోపేతంపై ప్రపంచ దేశాల నాయకులతో చర్చిస్తారు. పర్యటన ముగింపులో పారిస్ వేదికగా

జరిగే ప్రతిష్టాత్మక 'వివాటెక్ 2026' సాంకేతిక సదస్సులో ఆయన ప్రసంగిస్తారు

మరోవైపు, 1993లో స్లోవేకియా స్వతంత్ర దేశంగా

ఏర్పడిన తర్వాత ఒక భారత ప్రధాని అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

బ్రాటిస్లావాలో స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో, అధ్యక్షుడు పీటర్

పెల్లెగ్రినిలతో మోదీ భేటీ కానున్నారు. భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం

నేపథ్యంలో ఆటోమొబైల్, మౌలిక సదుపాయాలు, తయారీ రంగాల్లో పెట్టుబడులను

ఆకర్షించేందుకు ఈ చారిత్రాత్మక పర్యటన కీలక మైలురాయిగా నిలవనుంది.

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande