ఏపీని.డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు అందరూ సహకరించాలి హోమ్ మంత్రి అనిత
ఏపీని.డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు అందరూ సహకరించాలి హోమ్ మంత్రి అనిత
drug


అమరావతి, 26 జూన్ (హి.స.)

ఏపీనిడ్రగ్స్రహిత రాష్ట్రంగా మార్చేందుకు అందరూ సహకారం అందించాలని హోంమంత్రి వంగలపూడి అనిత కోరారు. ఈరోజు(శుక్రవారం) తుమ్మలపల్లి కళాక్షేత్రంలో డ్రగ్ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ‘నషా ముక్త్ భారత్ అభియాన్ - విక్షిత్ భారత్ కీ పెహచాన్’ థీమ్తో నిర్వహించి వర్క్షాప్కు హోం మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. ఏ తల్లిదండ్రులైనా ఒంట్లో బాగోలేని బిడ్డకు జీవితాంతం సేవ చేయడానికై సిద్ధపతారని చెప్పారు. కానీ.. గంజాయి మత్తులో పడి జైల్లో ఉన్న బిడ్డను విడుదల చేసేందకు ఏ పేరెంట్స్ కూడా ముందుకు రారన్నారు. హోం మంత్రి అయిన కొత్తలో ఓ వ్యక్తి తనకు ఫోన్ చేసి చెప్పిన విషయం షాక్కు గురయ్యేలా చేసిందన్నారు. నాలుగో తరగతి చదువుతున్న పిల్లాడు గంజాయికి బానిసయ్యాడంటూ సదరు వ్యక్తి చెప్పిన విషయం విని భయాందోళనకు గురైనట్లు చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande