వాట్స్ అప్ వినియోగదారుల కోసం మెటా సంస్థ వాట్స్ అప్ ప్లస్
వాట్స్ అప్ వినియోగదారుల కోసం మెటా సంస్థ వాట్స్ అప్ ప్లస్
whats app


అమరావతి, 26 జూన్ (హి.స.)

వాట్సప్ వినియోగదారుల కోసం మెటా సంస్థ ‘వాట్సప్ ప్లస్’ పేరిట పెయిడ్ సర్వీసెస్ను అందుబాటులోకి తెచ్చింది. నెలకు రూ.79తో ఈ సేవలు పొందొచ్చు. మొదటి నెల రోజులు ఉచితంగా ట్రై చేయొచ్చు కూడా. ‘వాట్సప్ ప్లస్’ కోసం ఇప్పటికే ఉన్న యాప్ సెటింగ్స్లోకి వెళ్లి సబ్స్క్రిప్షన్స్ విభాగాన్ని ఎంపిక చేసుకోవాలి. అక్కడ ‘వాట్సప్ ప్లస్’ కనిపిస్తుంది. అప్గ్రేడ్ యువర్ మెసేజింగ్ ఎక్స్పీరియన్స్పై క్లిక్ చేస్తే తొలుత నెల రోజుల పాటు ఫ్రీ ట్రయల్.. ఆ తర్వాత పెయిడ్ సర్వీసెస్ పొందొచ్చు.

అదనపు ప్రయోజనాలివే..: ప్రస్తుతం వాట్సప్లో 3 చాట్ల వరకే పిన్ చేసుకునే అవకాశముంది. వాట్సప్ ప్లస్లో 20 చాట్ల వరకూ పిన్ చేసుకోవచ్చు. వేల మెసేజ్లు వచ్చినా సరే.. మనకు కావాల్సిన ముఖ్యమైన 20 చాట్స్ స్క్రీన్పై టాప్లో కనిపిస్తాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande