విశాఖ రైల్వే.స్టేషన్ సమీపాన. రక్షణ గిరి.పై 32 అడుగుల ఎత్తయిన ఏసుక్రీస్తు.విగ్రహం ఏర్పాటు
విశాఖ రైల్వే.స్టేషన్ సమీపాన. రక్షణ గిరి.పై 32 అడుగుల ఎత్తయిన ఏసుక్రీస్తు.విగ్రహం ఏర్పాటు
christ


విశాఖపట్నం, 26 జూన్ (హి.స.)

విశాఖపట్నం రైల్వేస్టేషన్ సమీపాన రక్షణగిరిపై 32 అడుగుల ఎత్తయిన ఏసుక్రీస్తు విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ కొండపై ఏటా క్రిస్మస్ రోజున పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడ వందేళ్లు పైబడిన సెయింట్ పీటర్స్ చర్చి ఉంది. ఈ కొండపై నుంచి చూస్తే విశాఖలో అనేక ప్రాంతాలు కనిపిస్తాయి. ఆ కరుణామయుడు ఈ నగరాన్ని చల్లగా చూడాలని కోరుతూ ఆయన విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినట్టు స్థానిక మాజీ కార్పొరేటర్ తెలిపారు. దీని నిర్మాణం పూర్తికావడానికి మరో రెండు నెలలు పడుతుందని, ఆ తర్వాత ఈ విగ్రహాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande