
హైదరాబాద్, 26 జూన్ (హి.స.)
మహిళల ఆత్మగౌరవాన్ని
పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం ఆదిభట్ల సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన మన్నెగూడలోని జేఏఎంఆర్ గార్డెన్లో నిర్వహించిన ఇందిరమ్మ మహిళా శక్తి కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులకు, మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళల సంక్షేమం, ఆర్థిక సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతతో పనిచేస్తోందన్నారు. ప్రతి అర్హులైన మహిళకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసి స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు