పోలీసుల కార్డన్ సెర్చ్.. మద్యం స్వాధీనం- వాహనాల సీజ్
పోలీసుల కార్డన్ సెర్చ్.. మద్యం స్వాధీనం- వాహనాల సీజ్
Police


మహబూబాబాద్, 26 జూన్ (హి.స.)

మహబూబాబాద్ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అక్రమ కార్యకలాపాల నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.ఇందులో భాగంగా నేడు తెల్లవారు జామున జిల్లాలోని దంతాలపల్లి మండలం బొడ్లాడ గ్రామంలో పోలీసులు భారీ ఎత్తున కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.గ్రామంలోని పలు వీధులు, అనుమానాస్పద ప్రాంతాలు, నివాసాలు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సరైన రిజిస్ట్రేషన్, బీమా, తదితర పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇతర వాహనాలను సీజ్ చేశారు.స్వాధీనం చేసుకున్న వాహనాలను ఆర్టీఏ అధికారులకు అప్పగించి, పత్రాల పరిశీలన అనంతరం మోటారు వాహనాల చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande