రైతులకు నాణ్యమైన ఎరువులు అందివ్వాలి: భూపాలపల్లి ఎమ్మెల్యే
రైతులకు నాణ్యమైన ఎరువులు అందివ్వాలి: భూపాలపల్లి ఎమ్మెల్యే
MLA


భూపాలపల్లి, 26 జూన్ (హి.స.)

రైతులు నాణ్యమైన ఎరువులను

వినియోగించి అధిక దిగుబడి సాధించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అన్నారు. శుక్రవారం వారు జిల్లాలోని చిట్యాల మండల కేంద్రంలో గుమ్మడి సత్యనారాయణకు చెందిన నూతనంగా ఏర్పాటు చేసిన ఆకా ఫార్మర్స్ సర్వీస్ సెంటర్ ఫర్టిలైజర్ దుకాణాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులకు నాణ్యమైన ఎరువులు, వ్యవసాయ అవసరాలకు సంబంధించిన సేవలు అందుబాటులో ఉండటం వ్యవసాయాభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. రైతులు సరైన సమయంలో నాణ్యమైన ఎరువులను వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు.

అనంతరం ఆకా ఫార్మర్స్ సర్వీస్ సెంటర్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేసి, రైతులకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande