ముస్లిం.సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
ముస్లిం.సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
chandra babu


అమరావతి, 26 జూన్ (హి.స.)

మోహర్రం పర్వదినం నేడు. ఈ నేపథ్యంలో ముస్లిం సోదరులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మోహర్రం పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వారు స్పందించారు. ‘ఎన్ని కష్టాలు ఎదురైనా సత్య మార్గంలో నడవాలనే స్ఫూర్తిని మనకు మొహర్రం అందిస్తుంది. మోహర్రం అంటేనే త్యాగం. సత్యం, న్యాయం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని మొహర్రం సందర్భంగా స్మరించుకుందాం. మోహర్రం అందరికి శాంతిని తీసుకురావాలని, ధర్మ మార్గాన్ని చూపాలని కోరుకుంటున్నాను’ అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

శాంతి, సామరస్యాల ప్రతీకగా మొహర్రం: లోకేశ్

‘హజ్రత్ హుస్సేన్ మహనీయుని అమరత్వం, త్యాగాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు స్మరించుకునే సందర్బం మొహర్రం. త్యాగం, సహనంతో ధర్మ పరిరక్షణ కోసం పాటుపడటమే మొహర్రం మనకు ఇచ్చే సందేశం. అల్లాహ్ దీవెనలతో శాంతి, సామరస్యాల ప్రతీకగా మొహర్రం జరగాలని ఆకాంక్షిస్తున్నాను’ అని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande