తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కీలక మార్పులు
తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కీలక మార్పులు
ForestForest


హైదరాబాద్, 26 జూన్ (హి.స.)

తెలంగాణ అటవీ శాఖలో కీలక మార్పు చోటుచేసుకుంది. రాష్ట్ర అటవీ దళాల అధిపతి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (PCCF) డాక్టర్ సి.సువర్ణ ఈనెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ మేరకు ఆమెను సర్వీస్ నుంచి రిలీవ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఆమె స్థానంలో 1992 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి, ప్రస్తుతం ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (వైల్డ్ లైఫ్), చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ (CWLW)గా బాధ్యతలు నిర్వహిస్తున్న వినయ్ కుమార్కు పీసీసీఎప్గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande