
హైదరాబాద్, 26 జూన్ (హి.స.)
తెలంగాణ రాష్ట్ర తదుపరి ప్రభుత్వ
ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ సంజయ్ జాజు నియమితుయ్యారు. ఈ మేరకు ఇవాళ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 1992 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ సంజయ్ జాజు ఇన్నాళ్లు డిప్యూటేషన్పై కేంద్ర సర్వీసులలో 'మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్' సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఇటీవలే పేరెంట్ కేడర్కు బదిలీ చేస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ (DoPT) ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, తెలంగాణ ప్రస్తుత సీఎస్ కే. రామకృష్ణారావు పదవీ కాలం ఈనెల 30తో ముగియనుంది. ఈ క్రమంలోనే సీనియర్ ఐఏఎస్ సంజయ్ జాజును రాష్ట్ర తదుపరి సీఎస్గా నియమిస్తూ ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..