మెట్రో రైల్ అదనపు ఎండీగా అజిత్ రెడ్డి..
మెట్రో రైల్ అదనపు ఎండీగా అజిత్ రెడ్డి..
Metro rail


హైదరాబాద్, 27 జూన్ (హి.స.) తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పరిపాలనా విభాగంలో మరో కీలక నియామకం చేపట్టింది. ఇన్వెస్ట్ తెలంగాణ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా కొనసాగుతున్న సీనియర్ అధికారి అజిత్ రెడ్డి (IDES-2012)కి ప్రభుత్వం అదనపు బాధ్యతలను అప్పగించింది. ఆయనను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) అదనపు మేనేజింగ్ డైరెక్టర్ (Addl. MD) గా నియమిస్తూ శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఐటీ అండ్ సీ (I&C) శాఖ పరిధిలోని 'ఇన్వెస్ట్ తెలంగాణ' సీఈఓగా సేవలు అందిస్తున్న అజిత్ రెడ్డికి, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు హైదరాబాద్ మెట్రో రైల్ అదనపు ఎండీ పోస్టుకు సంబంధించిన పూర్తి అదనపు బాధ్యతలను (Full Additional Charge - FAC) అప్పగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టులు వేగవంతం అవుతున్న తరుణంలో, ఈ కీలక పోస్టులో అజిత్ రెడ్డి నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande