SIR నమోదును పరిశీలించిన కలెక్టర్ సీహెచ్ ప్రియాంక
SIR నమోదును పరిశీలించిన కలెక్టర్ సీహెచ్ ప్రియాంక
Collector


నారాయణపేట , 27 జూన్ (హి.స.)

నారాయణపేట జిల్లా ఊట్కూరు మండల కేంద్రంలోని 31 పీఎస్ పరిధిలో సర్ (Special Intensive Revision) ఓటరు నమోదు ప్రక్రియను జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక శనివారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆమె సూచించారు.

ఈ సందర్భంగా దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, నమోదు ప్రక్రియను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ప్రతి ఓటరికి అవకాశం కల్పించేలా బీఎల్ వోలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఓటరు జాబితా సవరణ చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్వో రషీద్, ఎంఆర్ఎ కృష్ణారెడ్డి, బీఎల్వో వెంకటేశ్వరమ్మ, బీఎల్ఎ కోరంశివరాత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande