వారంతపు సెలవుల.నేపథ్యంలో .తిరుమలకు పోటెత్తిన భక్తులు
వారంతపు సెలవుల.నేపథ్యంలో .తిరుమలకు పోటెత్తిన భక్తులు
వారంతపు  సెలవుల.నేపథ్యంలో .తిరుమలకు పోటెత్తిన భక్తులు


అమరావతి, 27 జూన్ (హి.స.)

వారాంతపు సెలవుల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి టోకెన్లు లేని వారికి 18 గంటల సమయం పడుతోంది. మరోవైపు తిరుపతి భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణునివాసం కౌంటర్ల వద్ద భక్తులు బారులు తీరారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి జారీ చేసే సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లను రద్దీ దృష్ట్యా రెండు గంటల ముందే అందజేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అల్పాహారం, నీరు, పాలు వంటివి శ్రీవారి సేవకుల ద్వారా అందజేస్తున్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande