
నగరి, 27 జూన్ (హి.స.) : నగరి అగ్నిమాపక కేంద్రాన్ని చిత్తూరు జిల్లా ఫైర్ ఆఫీసర్ సి. పెద్దిరెడ్డి ఈ రోజు ఉదయం తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా నగరి అగ్నిమాపక కేంద్రాధికారి ఎస్.పాండ్యన్తో కలిసి స్టేషన్లోని రికార్డులు, అగ్నిమాపక పరికరాలు, సిబ్బంది పనితీరు, నిర్వహణ అంశాలను పరిశీలించారు.
తనిఖీలో భాగంగా స్టేషన్ నిర్వహణ, అత్యవసర పరిస్థితుల్లో స్పందన, అందుబాటులో ఉన్న వనరులపై అధికారులు సమీక్ష నిర్వహించారు.
అగ్నిప్రమాదాల సమయంలో ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేలా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి జిల్లా ఫైర్ ఆఫీసర్ సి. పెద్దిరెడ్డి సూచించారు.నగరి అగ్నిమాపక కేంద్రం సిబ్బంది ఈ తనిఖీలో పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV