పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయం శిధిలం
పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయం శిధిలం
పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయం శిధిలం


అమరావతి, 28 జూన్ (హి.స.)

, శిరివెళ్ల: శిరివెళ్ల మండలంలోని చెన్నూరు గ్రామంలో 80 ఏళ్ల కిందట నిర్మించిన వెంకటేశ్వస్వామి ఆలయం శిథిలమైంది. రెండేళ్ల కిందట కోవెల పునరుద్ధరణకు గ్రామస్థులు, దాతలు ముందుకొచ్చారు. వీరికి దేవాదాయ ధర్మాదాయశాఖ సహకారం అందించింది. సుమారు రూ.2 కోట్లతో కోవెల కొత్తగా రూపుదిద్దుకొంది. పునఃప్రతిష్ఠ మహోత్సవాలు ఈనెల 30వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నట్లు గ్రామపెద్దలు తెలిపారు. జులై 1వ తేదీన యాగశాల ప్రవేశం, హోమం, 2న విగ్రహాల ఊరేగింపు, 3వ తేదీన దేవతా విగ్రహాలు, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, ఇతర క్రతువులు నిర్వహిస్తామన్నారు. ఉత్సవాల్లో భాగంగా అన్నదానం ఉంటుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహోత్సవాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande