
అమరావతి, 28 జూన్ (హి.స.)
గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసుస్టేషన్లో వైసీపీ నేతలపై పలు అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. తాడేపల్లి సీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి అంబటి రాంబాబుపైఅట్రాసిటీ కేసు నమోదు చేశారు. అలాగే తాడేపల్లి తెలుగు విద్యార్థి అధ్యక్షుడు రాయపూడి కిరణ్ ఫిర్యాదు ఆధారంగా మరో కేసు కూడా నమోదు చేశారు.
ఈ కేసుల్లో అంబటి రాంబాబు, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, పానుగంటి చైతన్య, వేమారెడ్డిలపై అట్రాసిటి కేసు నమోదు చేశారు. రైతుల ఫిర్యాదు మేరకు కూడా వైసీపీ నేతలపై మరో కేసు నమోదైంది. మరోవైపు, వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రైతులపై కూడా తాడేపల్లి పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ